NTV Telugu Site icon

TG BC Study Circle : బీసీ స్టడీ సర్కిల్స్ నోటిఫికేషన్ రిలీజ్

Tgbcsc

Tgbcsc

TG BC Study Circle : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హత గల అభ్యర్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

దరఖాస్తు ప్రక్రియ:
బీసీ స్టడీ సర్కిల్ నుండి అందించిన సమాచారం ప్రకారం, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్‌లైన్‌లో (www.tgbcstudycircle.cag.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతా ప్రమాణాలు.. తల్లిదండ్రుల ఆదాయం:
గ్రామీణ ప్రాంతాల్లో: రూ.1,50,000 మించకూడదు
పట్టణ ప్రాంతాల్లో: రూ.2,00,000 మించకూడదు

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షల్లో సాధించిన మార్కులు
రిజర్వేషన్ నియమాల ప్రకారం ఎంపిక జరుగుతుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్:
అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది.

ఉచిత శిక్షణ:
ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి కావాల్సిన మార్గదర్శకాలను, ప్రాపర్ ట్రైనింగ్‌ను అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ అవకాశాన్ని ప్రతి అర్హత గల అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, నిరుద్యోగ యువతకు మద్దతుగా ఉండే గొప్ప ప్రణాళికగా అభివర్ణించబడుతోంది.

Champions Trophy 2025: ఇండియాకు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?