జీవన్‌దాన్‌లో జాతీయస్థాయిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అవయవదానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు 14వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే (03.08.2024) సందర్భంగా జాతీయస్థాయిలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికై కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన రాష్ట్ర జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ స్వర్ణలత గారిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా గారితో కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన సంస్థ ఎండి హేమంత్ సహదేవ్ రావు, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ లు పాల్గొన్నారు.
Damodara Raja Narsimha : జీవన్‌దాన్‌లో జాతీయస్థాయిలో తెలంగాణ..

Damodara Raja Narasimha