NTV Telugu Site icon

Telangana Assembly Sessions Live: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్‌డేట్స్..

Telangana Asembli

Telangana Asembli

Telangana Assembly Sessions Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. తెలంగాణలో మూడోసారి కొలువు దీరిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సమావేశాలు ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు. డిసెంబరు 8న శాఖలు కేటాయించకుండానే సీఎం రేవంత్ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఎవరికీ కీలకమైన హోం శాఖను కేటాయించలేదు.

The liveblog has ended.
  • 09 Dec 2023 01:24 PM (IST)

    14వ తేదీకి సభ వాయిదా..

    కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కాగా… కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.

  • 09 Dec 2023 12:28 PM (IST)

    అసెంబ్లీ కి చెప్పులు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

    అసెంబ్లీకి చెప్పులు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు. దేవి నవరాత్రులు సందర్భంగా అనిల్ జాదవ్ మొక్కు కోవడంతో.. ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత ఆయన చెప్పులు వేసుకుంటా అని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా.. సోమవారం నుంచి బోద్ ఎమ్మెల్యే చెప్పులు వేసుకోనున్నారు.

  • 09 Dec 2023 12:26 PM (IST)

    పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..

    బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు.

  • 09 Dec 2023 12:23 PM (IST)

    స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్

    సగం మందికిపైగా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూరైంది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత.. స్పీకర్ పదవికి నోటిఫికేషన్ రానుంది.

  • 09 Dec 2023 12:22 PM (IST)

    నేడు రెండు పథకాలకు శ్రీకారం..

    నేడు రెండు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, పేదలందరికీ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత ప్రారంభించనున్నారు.

  • 09 Dec 2023 12:20 PM (IST)

    ప్రమాణ స్వీకారానికి మరొక రోజు ఇవ్వాలి- శాసనసభ సెక్రటరీని కోరిన కేటీఆర్

    ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కేటీఆర్ హాజరు కాలేదు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా కేటీఆర్ మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

  • 09 Dec 2023 12:18 PM (IST)

    కోమటి రెడ్డి, ఉత్తమ్ ఇద్దరు ప్రమాణం చెయ్యరు

    కోమటి రెడ్డి, ఉత్తమ్ ఇద్దరు ప్రమాణం చెయ్యరు. ఎందుకంటే.. ఇద్దరు ఎంపి పదవికి రాజీనామా చేయలేదు కాబట్టి.. కోమటి రెడ్డి, ఉత్తమ్ ఇద్దరు ప్రమాణం చెయ్యరు.

  • 09 Dec 2023 11:56 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో పార్టీల బలాలు:

    తెలంగాణ అసెంబ్లీలో పార్టీల బలాలు వీరే.. కాంగ్రెస్ - 64, బీఆర్ఎస్ - 39, బీజేపీ - 08, ఎంఐఎం - 07, సీపీఐ - 01

  • 09 Dec 2023 11:50 AM (IST)

    బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమాణం…

    తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమాణం చేశారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. చామకూర మల్లారెడ్డి ప్రమాణ స్వీకారంలో అసెంబ్లీ ప్రాంగణం అంతా నవ్వులు చిందించారు. ఆయన ప్రమాన స్వీకారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ నవ్వుతూ మల్లారెడ్డి వైపు చూసారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం అంతా కాసేపు మల్లారెడ్డిని చూసి చిరునవ్వులు చిందించారు.

  • 09 Dec 2023 11:40 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా అధికారపక్షంలో కాంగ్రెస్

    తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా అధికారపక్షంలో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లపాటు ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ… ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకొని సింగిల్ గానే అధికారంలోకి వచ్చింది. వారి మిత్రపక్షం సీపీఐకి వచ్చిన ఒక్కసీటుతో కలుపుకొని వారి బలం 65కి చేరింది. ఇక పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్… ప్రతిపక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో సరిపెట్టుకున్న ఆ పార్టీ…. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. తొలిసారిగా అధికారపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జోష్ కనిపించింది. ఇక ప్రతిపక్షం అడిగే ప్రశ్నలతో పాటు ప్రభుత్వం చేపట్టబోయే పనుల వివరాలను చెప్పనుంది అధికార కాంగ్రెస్.

  • 09 Dec 2023 11:32 AM (IST)

    సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు

    109 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా కేసీఆర్‌, కేటీఆర్‌ సభకు హాజరుకాలేదు. సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది రాలేదు. మొదటి రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

  • 09 Dec 2023 11:24 AM (IST)

    ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం

    ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి, సీతక్క ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రమాణస్వీకారం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ ఓవైసీ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత జూపల్లి ప్రమాణం చేశారు. సభ ప్రారంభం కాగానే మొటగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

  • 09 Dec 2023 11:21 AM (IST)

    ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలిసారిగా అసెంబ్లీలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్‌ చేశారు.

  • 09 Dec 2023 11:20 AM (IST)

    తెలంగాణ ప్రజలకు ఒక పండుగ - సీఎం రేవంత్

    సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ.. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది.. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు” అని సీఎం రేవంత్‌రెడ్డి

  • 09 Dec 2023 11:19 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

Show comments