Site icon NTV Telugu

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ

Tg Assembly

Tg Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి (ఆగస్టు 30) ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా ఉంది. చర్చల అనంతరం, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రభుత్వానికి ముందుకు ఎలా అడుగులు వేయాలో నిర్ణయించుకోవడం జరుగనుంది.

Also Read:HYD Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో సేవలు పొడిగింపు..

ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‎కు అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో సంతాపం ప్రకటించి తొలిరోజు సభను వాయిదా వేయనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సమావేశాల అజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పండగ ఉండడం, ఆ తరువాత శనివారం నిమజ్జనం ఉండటంతో పోలీస్​ బందోబస్తు, ఇతర ఏర్పాట్ల నేపథ్యంలో గురువారం వరకే సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

Also Read:Crime News: కారుకు చిన్న డ్యాష్ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టిన గ్యాంగ్‌!

తొలిరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే కమిటీ హాల్‎లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మంత్రుల కమిటీ ఏర్పాటు చేయగా.. మూడు ప్రతిపాదనలను సూచించింది. ఇందులో ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లు పెంచడం లేదా పార్టీ పరంగా అమలు చేయడం, మూడోది బీసీ బిల్లులు, ఆర్డినెన్స్​పై న్యాయ పరంగా పోరాటం చేయడం ఉన్నాయి.

Exit mobile version