NTV Telugu Site icon

Telangana Assembly Session 2024: కేంద్ర బడ్జెట్‌పై చర్చ.. శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు ఇవే!

Telangana Assembly Sessions 2024

Telangana Assembly Sessions 2024

Telangana Assembly Sessions 2024: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. షార్ట్ డిస్కషన్ కింద స్పీకర్ అనుమతి ఇస్తే.. కేంద్ర బడ్జెట్‌పై సభలో​ చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సభలో తీర్మానం చేయనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది.

నేడు అసెంబ్లీలో ఇలా:
1) ప్రశ్నోత్తరాలు
2) ప్రభుత్వ రిజల్యూషన్
3) నిన్న బిఎసిలో తీసుకున్న నిర్ణయాలు ఉభయసభల్లో టేబుల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.
4) వివిధ డిపార్ట్మెంట్ల యాన్యువల్ రిపోర్టులను ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు.
a) ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాత్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 23 వ వార్షిక రిపోర్టును సభలో ప్రవేశపెడతారు.
b) ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ యాన్యువల్ రిపోర్ట్ ను విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు.
C) తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్
d) వార్షిక నివేదికను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు.
5) ఇటీవల దివంగతులైన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాలు
డాక్టర్ నెమురు గొమ్ముల సుధాకర్ రావు
మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్
ధర్మపురి శ్రీనివాస్
రమేష్ రాథోడ్
ధర్మపురి శ్రీనివాస్ సంతాప తీర్మానం శాసనమండలిలో కూడా ప్రవేశపెడతారు.
6) శాసనసభలో స్వల్పకాలిక చర్చ (యాక్టివిటీస్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో సిటీ)

శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు:
1) పాఠశాలలు మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు
2) తండాలను గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ
3) ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు
4) వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు
5) నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గంలో క్రీడా సముదాయం
6) తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటి ఏర్పాటు
7) ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లింపు
8) రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
9) జాతీయ రహదారి విస్తరణ పనులు
10) మూసీ నదికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం

Also Read: MLA-Pregnant Womens: ఆసుపత్రిలో లేని వైద్యులు.. ఇద్దరు గర్భిణులకు పురుడు పోసిన ఎమ్మెల్యే!

శాసనమండలిలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు:
1) ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని గంధ మల్ల రిజర్వాయర్ పూర్తీకరణ.
2) రాష్ట్రంలో పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం.
3) గృహలక్ష్మి పథకం
4) బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు
5 రైతు భరోసా పథకం
6) ఆరు హామీల పథకం కింద కొత్త రేషన్ కార్డుల జారీ
7) గృహ జ్యోతి పథకం
8) రాష్ట్రంలో నీటి సంక్షోభం
9) పెండింగ్ డీఏల విడుదల
10) కోకాపేట భూముల కేటాయింపు

 

Show comments