Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభలో వస్తు సేవల పన్ను (GST) చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై విస్తృత చర్చ జరిగిన అనంతరం, సభ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించింది. ప్రధానంగా పన్నుల విభాగంలోని ఉన్నతాధికారుల హోదాలను పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న ‘సేల్స్ టాక్స్ కమిషనర్’ పోస్టు పేరును ఇకపై ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్’గా మార్చారు. అలాగే.. అదనపు కమిషనర్ (గ్రేడ్-1) హోదాను ‘స్టేట్ టాక్స్ కమిషనర్’గా మారుస్తూ చట్ట సవరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలలోని ఉన్నతాధికారుల హోదాలతో తెలంగాణ అధికారుల హోదాలను సమన్వయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Also Read:PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ మార్పుల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక భారం గానీ, నష్టం గానీ ఉండదని స్పష్టం చేశారు. కేవలం పరిపాలనాపరమైన సౌలభ్యం, మెరుగైన కమ్యూనికేషన్ , సమన్వయం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారుల హోదాల్లో మార్పులు చేయడం ద్వారా జీఎస్టీ అమలులో ఎదురయ్యే టెక్నాలజీ పరమైన ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి వివరణతో సంతృప్తి చెందిన సభ, చివరగా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!