Site icon NTV Telugu

Telangana Assembly: రేపటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

Telangana

Telangana

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విడుదల చేయనున్నారు.

 

Read Also: Mekathoti Sucharita: దండాలయ్యా.. మహారాజై నువ్వు ఉండాలయ్యా.. జగన్‌పై పాటపాడిన సుచరిత

 

Exit mobile version