NTV Telugu Site icon

TS Assembly: ప్రభుత్వ నోట్‌పై ప్రిపేర్‌కు టైమ్‌ కావాలన్న విపక్షాలు.. అరగంట టీ బ్రేక్‌ ఇచ్చిన స్పీకర్‌

Ts Assembly

Ts Assembly

TS Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల చేసింది. 42 పేజీల పుస్తకాన్ని సభ్యులకు అందించి చర్చను ప్రారంభించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనం సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 42 పేజీల పుస్తకం ఇస్తే రెండు నిమిషాల్లో చర్చ ప్రారంభిస్తే ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ముందురోజే నోట్ ఇచ్చి ఉంటే ఏం చెప్పాలో ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేదన్నారు. నోట్ చదవడానికి కనీసం ఒక గంట టీ విరామం ఇవ్వాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. నోట్ సిద్ధం చేసేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సభ్యులు ఇచ్చిన నోట్‌పై ప్రిపేర్‌ చేసేందుకు టీ బ్రేక్‌కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో స్పీకర్ టీ విరామం ప్రకటించి సభను అరగంట పాటు వాయిదా వేశారు.

భట్టి, శ్రీధర్ బాబు మాటలు..

ఇక నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే సభ అరగంటపాటు వాయిదా వేశారు. కాగా.. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలిపింది. అనంతరం గడ్డం ప్రశాద్ మాట్లాడుతూ.. ఎవరు ఎవరికి కించపరిచినట్లు మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు. శాసన సభలో అందరూ ఒకరినినొకరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలని కోరారు. సభను మరింత హుందాగా నడపాలని కోరారు. మూడో శాసన సభ లో 57 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు.. రన్నింగ్ కామెంట్స్ చేయకండి అన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులు .. కొత్త వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. శాసన సభలో అందరూ మాట్లాడే మాటలు ప్రజలందరికి ఆదర్శప్రాయంగా కావాలని కోరారు. అనంతరం ముందుగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడాలని స్పీకర్ కోరారు. ముందుగా ఇక డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.. దశాబ్ద కాలం పాలించిన గత పాలకులు.. అన్ని వనరులను అనుకున్న దిశగా నడిపించలేదన్నారు. రోజు వారి ఖర్చులు కూడా లేకుండా చేశారు. ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఆర్థిక ఆరాచకత్వం జరిగిందన్నారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పాలన్నారు. మార్పు కోరుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. వారికి కూడా ఆర్థిక పరిస్థితి తెలియ చేయాలని మేము శ్వేతపత్రం విడుదల చేస్తున్న అన్నారు. ఇక ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గతంలో కూడా డిస్కషన్ మొదలు ఐనప్పుడే మాకు నోట్ ఇచ్చారని తెలిపారు. మేము కూడా ఇదే విషయం అక్కడ ఉన్నప్పుడు చెప్పామన్నారు. హరీష్ సూచన పరిగణలోకి తీసుకుంటామన్నారు. సభలో పెట్టగానే చర్చ అంటే ఎలా? అని హరీష్ రావు ప్రశ్నించారు. సభ్యుల హక్కులు కాపాడాలి మీరు అన్నారు. ప్రొటెస్ట్ చేసే హక్కు సభ్యులకు ఇవ్వాలని కోరారు. మా హక్కులు కాపాడండి అన్నారు. ఇక మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. 42 పేజీలు ఇచ్చారు.. ఇది చదువుకోవాలంటే టీ బ్రేక్ అయినా ఇవ్వండని కోరారు. ప్రిపేర్ కాకుండా ఇంత ప్రాధాన్యత అంశంపై చర్చ చేయలేమన్నారు. టీ బ్రేక్ కనీనం 40 నిమిషాలు ఇస్తే మేము చదువుకుని ప్రశ్నించే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం శాసనసభలో అరగంట పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి.
H-1B Visa: అమెరికా గుడ్‌న్యూస్‌.. హెచ్- 1బీ వీసాల పునరుద్ధరణ