Bird Flu Tension: కోళ్లలో వేగంగా వ్యాప్తిస్తోన్న వైరస్ పట్ల రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. వైరస్ పట్ల అప్రమత్తంగాఉండాలంటూ రాష్ట్రాలకు సూచించింది.. దీంతో.. అలర్ట్ అయిన తెలంగాణ పశు సంవర్ధక శాఖ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. టీజీ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్.. జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, అనారోగ్యంతో.. వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టలని స్పష్టం చేశారు… వైరస్ సోకిన కోళ్ల తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు..
Read Also: Telangana Govt-CRISP: ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్!
మరోవైపు.. ఏపీతో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది.. ఇక, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో మిగిలిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఫ్లూ వ్యాపించిన పౌల్ట్రీ ఫార్మ్ కు వచ్చాయి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీలో మిగిలిన కోళ్లకు మత్తు ఇచ్చి చనిపోయేలా చేస్తున్నారు.. ఆ కోళ్లను గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టనున్నారు. పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్తీషియా ఇస్తున్నారు.. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ మార్కెట్‌లో అమ్మకాలు పడిపోయాయి. రాజమండ్రిలో చికెన్ మార్కెట్ అమ్మకాలు లేక వెలవెలబోతుంది. చికెన్ రేటు కూడా కేజీకి 30 రూపాయలు తగ్గిపోయింది. పౌల్ట్రీ నుంచి వచ్చే కోళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూ నేపద్యంలో జిల్లా లో అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా నిలిపివేశారు. దీనితో చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు భారీగా పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.. కాగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఈ బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోన్న విషయం విదితమే..