Biggboss : కంటెస్టెంట్లకు ఊహించని షాకిచ్చిన బిగ్ బాస్.. శనివారమే ఎలిమినేషన్
- 13వ వారంలో డబుల్ ఎలిమినేషన్
- శనివారం టేస్టీ తేజా ఎలిమినేట్
- ఆదివారం మరో ఎలిమినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో మిగులుతారు. మిగిలిన వారు దాదాపుగా ఎలిమినేట్ అవుతారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 8 13వ వారం డబుల్ ఎలిమినేట్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్ మలియక్కల్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, జబర్దస్త్ రోహిణి, జబర్దస్త్ అవినాష్, నబీల్ అఫ్రీదితో కలిపి తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు.
వీరందరికి పదమూడో వారం నామినేషన్లు ఒక్కరోజు మాత్రమే జరిగాయి. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, నిఖిల్, అవినాష్, నబీల్ ఉన్నారు. వీరికి నామినేషన్స్ పూర్తికావడంతోనే ఓటింగ్ పోల్ ఓపెన్ అయిపోయింది. ఓటింగ్‌లో ఈ వారం మొదట్లో గౌతమ్ టాప్ 1 స్థానంలో కొనసాగగా.. రెండో స్థానంలో నిఖిల్ నిలిచాడు. అయితే, వీకెండ్ వచ్చేసరికి వీరి స్థానాలు మారిపోయాయి. దీంతో మొదటి స్థానంలో నిఖిల్, రెండో స్థానంలోకి గౌతమ్ దిగిపోయాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ కొనసాగింది. నాలుగో స్థానంలో విష్ణుప్రియ ఉంటే ఐదో స్థానంలో నబీల్ ఉన్నాడు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Read Also:Vaibhav Suryavanshi: ధోనీ-కోహ్లీ కాదు.. నాకు ఆదర్శం ఇతనే
బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అంటే శనివారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఈ క్రమంలో నేడు హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారని తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఐతే బిగ్ బాస్ నుంచి వచ్చే లీక్స్ ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అన్న విషయం తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చిన తేజ అప్పుడు పది వారాల పాటు ఉన్నాడు. ఐతే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తేజ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం రోహిణి తప్ప మిగతా అందరు నామినేషన్లలో ఉన్నారు. దాదాపు టాప్ కంటెస్టెంట్స్ అంతా కూడా నామినేషన్లలో ఉండడం వల్ల తేజాకు లీస్ట్ ఓటింగ్ నమోదైంది. సీజన్ 7 లో ఎంటర్టైనింగ్ మాత్రమే చేసిన తేజ ఈ సీజన్ లో ఫిజికల్ టాస్క్ లో కూడా బాగానే ఆడాడు. ఐతే ఎంత చేసినా సరే ఆడియన్స్ దృష్టిలో మార్కులు సంపాదించుకోలేకపోయాడు. ఐతే డబుల్ ఎలిమినేషన్ కాబట్టి తేజ ఎలిమినేషన్ ని శనివారమే నిర్వహించారు. బిగ్ బాస్ శనివారమే తేజాని హౌస్ నుంచి బయటకు పంపించారు. ఐతే తేజాతో పాటు మరొకరు కూడా ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అది ఎవరన్నది మాత్రం కాస్త సస్పెన్స్ నడుస్తుంది. పృథ్వీ, అవినాష్, విష్ణు ప్రియ ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అవినాష్ టికెట్ టు ఫినాలె టాస్క్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Read Also:Viral Video: విద్యార్థినికి అలాంటి మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడు.. ఉతికి ఆరేసిన పేరెంట్స్ (వీడియో)
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?