NTV Telugu Site icon

AP CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులు సీఎంకి వివరించారు.

Also Read: Chandrababu: చంద్రబాబుకు అస్వస్థత.. వైద్యుడిని జైలుకు పిలిపించిన అధికారులు

ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణాన్ని మహీంద్ర గ్రూప్ చేపట్టనుంది. వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్ర సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్ర విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ పాల్గొన్నారు.

Show comments