NTV Telugu Site icon

Xiaomi Electric Car: షియోమీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు..ఫోటోలు వైరల్

1123

1123

షియోమీ.. ఈ పేరు వినగానే అందరికీ స్మార్ట్​ఫోన్స్​, టీవీలతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు గుర్తుకొస్తాయి. ఈ చైనీస్​ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండే ఉంది. దీంతో ఇదే అదునుగా ఇప్పుడు ప్రపంచ ఈవీ మార్కెట్​పై కన్నేసింది షియోమీ. ఈ క్రమంలోనే ఎమ్​ఎస్​11 సెడాన్​ పేరుతో ఓ ఎలక్ట్రిక్​ వాహనాన్ని రూపొందిస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సమాచారం. త్వరలోనే ఇది మార్కెట్లో లాంచ్​ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​కు సంబంధించిన ఫోటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. దీంతో యూనిక్ డిజైన్‌తో ఉన్న ఈ కారు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​ డిజైన్​.. ప్రముఖ చైనీస్​ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీకి చెందిన సియెల్​ ఎలక్ట్రిక్​ సెడాన్​తో పోలీ ఉంది. బీవైడీ ఈవీని 2023 ఆటోఎక్స్​పోలో కూడా ప్రదర్శించారు. ఇక అంతర్జాతీయంగా ప్రముఖ మోడల్స్​ నుంచి స్ఫూర్తి తీసుకుని.. ఈ షియోమీ తొలి ఎలక్ట్రిక్​ కారును రూపొందించినట్టు కనిపిస్తోంది. ఈ నాలుగు డోర్ల​ ఎలక్ట్రిక్​ సెడాన్​లో ఫ్లోయింగ్​ లైన్స్​, ఎయిరోడైనమిక్​ సిల్హోయిట్​ ఉన్నాయి. ఫ్రంట్​లో ట్రైడెంట్​ ఆకారంలో ఎల్​ఈడీ లైట్స్​ ఉండటంతో లుక్​ ఇంకాస్త అగ్రెసివ్​గా మారింది. ఇక ఇందులో విండ్​షీల్డ్​ పెద్దగా ఉండటంతో పాటు సైడ్​ గ్లాస్​ కూడా ఎక్కువగానే ఉంది. పానారోమిక్​ సన్​రూఫ్​ రేర్​ వరకు ఎక్స్​టెండ్​ అయ్యి ఉంది. వీల్స్​ మధ్యలో షియోమీ బ్రాండ్​ లోగో కనిపిస్తోంది. ఇందులోని టెయిల్​గేట్స్​ డిజైన్​.. ఆస్టన్​ మార్టిన్​ వెహికిల్​ను పోలి ఉంది.

Also Read: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?

ఆన్​లైన్​లో లీక్​ అయిన ఈ షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​లో ఇంటీరియర్​కు సంబంధించి వివరాలేవీ లేవు. టెక్నికల్​ స్పెసిఫికేషన్స్​ గురించి కూడా ఎలాంటి వివరాలు లేవు. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారును షియోమీ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవీకి సంస్థ తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. చైనా రోడ్లపై ఇప్పటికే దీని టెస్టింగ్​ జరిగినట్టు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.