Site icon NTV Telugu

Team India: టీ20 చరిత్రలో టీమిండియా అరుదైన రికార్డు..

Team India

Team India

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆఫ్ఘానిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 10 మంది ఆఫ్ఘాన్ బ్యాటర్లను క్యాచ్ రూపంలోనే ఔట్ చేశారు. షార్ట్ ఫార్మాట్ హిస్టరీలో భారత్ ఇలా చేయడం ఇదే మొదటిసారి. అందులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 3 క్యాచ్ లు అందుకున్నారు. రోహిత్ శర్మ 2, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ పట్టుకున్నారు.

Read Also: Railway Helpline Number: రైలు ప్రయాణికులకు ఈ నెంబర్ ముఖ్యం.. సేవ్ చేసుకోండి

బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా గురువారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇండియా బ్యాటింగ్ లో సూర్యకుమార్‌ యాదవ్ (53) అర్ధసెంచరీతో రాణించాడు. కాగా.. భారత్‌ తర్వాతి సూపర్‌-8 మ్యాచ్‌లో శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Read Also: Vladimir Putin – Kim Jong Un : కిమ్ ను సరదాగా కారులో తిప్పిన పుతిన్.. వీడియో వైరల్..

Exit mobile version