NTV Telugu Site icon

IND vs SA: తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం

Sa Won

Sa Won

IND vs SA: సౌతాఫ్రికాతో సెంచూరియన్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఈ విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. 131 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 76 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రా డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన టీమిండియా… రెండో ఇన్నింగ్స్ లో చెత్తగా ఆడారు. విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్నారు.

Read Also: Viral Video: ప్రధానిపై ఇంత ద్వేషమా..! మోడీ పోస్టర్‌పైకి రాయి విసిరిన వ్యక్తి

కాగా.. భారత్ బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (5), గిల్ (26), శ్రేయాస్ (6), రాహుల్ (4), శార్దుల్ (2), సిరాజ్ (4) పరుగులు మాత్రమే చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. జాన్ సెన్ 3, రబాడా 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో జరగనుంది.

Read Also: Amit Shah : అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం

Show comments