అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీఫ్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు. కాగా.. ఈనెల 5 నుంచి అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. టీమిండియా క్రికెటర్లు ఇక్కడికి వచ్చారు. అయితే.. టీమిండియా తెలుగు అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. అందరినీ ఒకే చోట చూసే అదృష్టం కలుగుతుంది.
Read Also: US-Israel: నెతన్యాహు తీరుపై అమెరికా అధ్యక్షుడు అసహనం
దేశవాళీ క్రికెట్ దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది. అందులో 6 మ్యాచ్ లకు గాను.. అనంతపురంలో 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, పంత్, సిరాజ్, గిల్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు బీసీసీఐ సెలెక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.
Read Also: AP Floods : ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు వైజయంతీ మూవీస్ భారీ విరాళం
గతంలో కాకుండా.. ఈసారి టోర్నీ భిన్నంగా ఉండనుంది. ఇంతకుముందు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ లు ఉండేవి. అయితే.. ఈసారి టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగుతుండటంతో ఇండియా A, B, C, D జట్లుగా మార్చారు. ఇండియా ‘A’ జట్టుకు శుభ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ‘B’ జట్టుకు అభిన్యు ఈశ్వరన్, ‘C’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, ‘D’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ లు కెప్టెన్లుగా ఉండనున్నారు.