Site icon NTV Telugu

India Cricket Schedule: టీమిండియా షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్, వైజాగ్ లోనూ మ్యాచ్లు

Team India

Team India

టీమిండియా ఇంటర్నేషనల్ హోమ్ సీజన్ 2023-24 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. అక్టోబర్- నవంబర్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత ఈ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ భారత జట్టు స్వదేశంలో ఆడనుంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ లు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనుంది. అందుకు సంబంధించి షెడ్యూల్ తో పాటు వేదికలు, టైమింగ్స్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కూడా రెండు కీలక మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది. ఆస్ట్రేలియాతో టీ20, ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ హైదరాబాద్ లో జరుగనుంది. అంతేకాకుండా వైజాగ్ లో ఒక టీ20, ఇంగ్లండ్ తో రెండు టెస్ట్ జరగనుండటం తెలుగు క్రికెట్ అభిమానులకు పండుగే.

Brahmanandam: పవన్ దైవాంశ సంభూతుడు.. ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు

మరోవైపు వరల్డ్ కప్ ముందు భారత్.. సెప్టెంబర్ లో ఆసీస్ తో 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాతనే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ ముగిశాక.. మళ్లీ ఆస్ట్రేలియాతో 5 టీ20మ్యా్చ్ లు ఆడనుంది. డిసెంబర్- జనవరిలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక.. అఫ్గానిస్తాన్ తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత జనవరి 24 నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ ల సిరీస్ మొదలవుతుంది.

Colors Swathi: విడాకులపై ఓపెన్ అయిన కలర్స్ స్వాతి?

ఆస్ట్రేలియాతో 3 వన్డేలు.. ఏఏ తేదీ.. ఏఏ వేదిక

సెప్టెంబర్ 22, ఫస్ట్ వన్డే – మొహాలీ
సెప్టెంబర్ 24, సెకండ్ వన్డే – ఇండోర్
సెప్టెంబర్ 27, థర్డ్ వన్డే – రాజ్‌కోట్

ఆస్ట్రేలియాతో ఐదు టీ20లు.. ఏఏ తేదీ.. ఏఏ వేదిక
నవంబర్ 23, తొలి టీ20 – వైజాగ్
నవంబర్ 26, రెండో టీ20 – త్రివేండ్రం
నవంబర్ 28, మూడో టీ20 – గువహతి
డిసెంబర్ 01, నాలుగో టీ20 – నాగ్‌పూర్
డిసెంబర్ 03, ఐదో టీ20 – హైదరాబాద్

అఫ్గానిస్తాన్‌తో మూడు టీ20లు.. ఏఏ తేదీ.. ఏఏ వేదిక
జనవరి 11, తొలి టీ20 – మొహాలీ
జనవరి 14, రెండో టీ20 – ఇండోర్
జనవరి 17, మూడో టీ20 – బెంగళూరు

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు.. ఏఏ తేదీ.. ఏఏ వేదిక
జనవరి 25 – 29, ఫస్ట్ టెస్ట్ – హైదరాబాద్
ఫిబ్రవరి 2 – 6, సెకండ్ టెస్ట్ – వైజాగ్
ఫిబ్రవరి 15 – 19, థర్డ్ టెస్ట్ – రాజ్‌కోట్
ఫిబ్రవరి 23 – 27, ఫోర్త్ టెస్ట్ – రాంచీ
మార్చి 7 – 11, ఫిఫ్త్ టెస్ట్ – ధర్మశాల

 

Exit mobile version