Site icon NTV Telugu

Gautam Gambhir: జట్టును వదిలేసి భారత్ కు చేరుకున్న టీమిండియా కోచ్.. ఎందుకంటే..?

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకస్మికంగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా జట్టును వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. జూన్ 20న ప్రారంభమయ్యే భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముందు, అతను స్వదేశం చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం.. గంభీర్ తన తల్లి ఆరోగ్యం కారణంగా భారత్ కు చేరుకున్నాడు. అందిన సమాచారం మేరకు జూన్ 11న గంభీర్ తల్లి శీమా గంభీర్ గుండెపోటుతో బాధపడినట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం విషమించడంతో గంభీర్ తక్షణమే ఇంగ్లాండ్ టూర్‌ను వదిలి భారతదేశానికి బయలుదేరారు. తాజా సమాచారం ప్రకారం గంభీర్ జూన్ 17 నాటికి మళ్లీ జట్టుతో చేరవచ్చని తెలుస్తోంది.

Read Also: Indian Coast Guard Recruitment 2025: 10th పాసైతే చాలు.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో జాబ్స్ మీవే..

ఇటీవలే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త రూపాన్ని దాల్చింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో జట్టు గత వారం ఇంగ్లాండ్ కు చేరింది. అప్పటి నుంచి సిరీస్ కోసం శిక్షణ ప్రారంభించింది. ఈ సిరీస్ 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) భాగంగా జరుగనుంది. ముఖ్యంగా, 2007 తర్వాత ఇంగ్లాండ్ నేలపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో ఈ యువ జట్టు బరిలోకి దిగనుంది.

Read Also: WTC Final: మరోసారి మెరిసిన రబాడ.. రెండో ఇంనింగ్స్ లో ఆసీస్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

ఈ సిరీస్‌ను “టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ”గా పిలువనున్నారు. మొత్తం 5 టెస్టులుగా ఈ సిరీస్ జరగనుంది. సిరీస్ పూర్తి టెస్ట్ షెడ్యూల్ ఇలా ఉంది.

1వ టెస్ట్: జూన్ 20–24 – లీడ్స్ (హెడింగ్లీ)

2వ టెస్ట్: జులై 2–6 – బర్మింగ్హామ్

3వ టెస్ట్: జులై 10–14 – లార్డ్స్

4వ టెస్ట్: జులై 23–27 – మాంచెస్టర్

5వ టెస్ట్: జులై 31–ఆగస్టు 4 – ది ఓవల్.

Exit mobile version