Shubman Gill Dropped: ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగే చివరి టీ20 మ్యాచ్ కి దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా గిల్ కాలి బొటనవేలికి గాయం అయినట్లు టాక్. నాలుగో టీ20 జరిగినా.. గిల్ మ్యాచ్ ఆడేగలిగేవాడు కాదు. ‘నాలుగో టీ20 నేపథ్యంలో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఆఖర్లో బంతి బలంగా కాలి బొటనవేలిని తగిలింది.
Read Also: Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
అయితే, బాల్ బలంగా తగలడంతో గిల్ నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. డిసెంబర్ 17న జరగాల్సిన మ్యాచ్‌లో ఆడడం గిల్‌కు కష్టమయ్యేది. అతడు అహ్మదాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆడడం కూడా అనుమానంగా ఉందని ఓ బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు. అలాగే, శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లకు కూడా దూరమైన విషయం తెలిసిందే. అతను రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. టీ20 సిరీస్ ముందు మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
