NTV Telugu Site icon

Venkatesh Iyer Marriage: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్‌.. ఫొటోస్ వైరల్!

Venkatesh Iyer Marriage

Venkatesh Iyer Marriage

Venkatesh Iyer ties the knot with Shruti Raghunathan: టీమిండియా క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్‌ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య వెంకీ-శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. వెంకటేష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన జంటకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెతున్నాయి. వెంకటేష్, శృతిలు 2023 నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకున్నారు.

ఐపీఎల్ 2024లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజేతగా నిలిచి.. మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌ విజయంలో వెంకటేశ్‌ అయ్యర్‌ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ ఆడి 370 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. అయితే ఐపీఎల్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టీ20 ప్రపంచకప్ 2024 భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Also Read: BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!

1994 డిసెంబరు 25న ఇండోర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన వెంకటేశ్‌.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో 2021లో న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పయి టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 2 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి.. వరుసగా 24, 133 పరుగులు చేశాడు. టీ20ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.

Show comments