NTV Telugu Site icon

Hardik Pandya Dating: సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!

Hardik Pandya Jasmin Walia

Hardik Pandya Jasmin Walia

Hardik Pandya New Girlfriend is Jasmin Walia: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరికీ సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. నటాషా మరొకరితో ప్రేమలో పడిందని ఇప్పటికే వార్తలు హల్‌చల్‌ చేయగా.. తాజాగా హార్దిక్ ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. బ్రిటిష్‌ సింగర్‌, టీవీ నటి జాస్మిన్‌ వాలియాతో హార్దిక్ డేటింగ్‌ చేస్తున్నాడట.

Also Read: Gold Rate Today: నిన్న 1000 పెరిగితే.. నేడు 100 మాత్రమే తగ్గింది!

హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తూ.. ఫొటోలకు పోజులిచ్చాడు. అంతకుముందు జాస్మిన్‌ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇద్దరు స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఒకేవిధంగా ఫొటోలు దిగారు. దాంతో హార్దిక్‌, జాస్మిన్‌ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్ట్‌లకు ఒకరికొకరు లైక్‌ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. గతంలోనూ జాస్మిన్‌ పోస్ట్‌లకు హార్దిక్‌ కామెంట్లు చేశాడు. ఇవన్నీ చూస్తుంటే.. హార్దిక్‌, జాస్మిన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు అర్ధమవుతోంది.

Show comments