Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గిందని సంతోషపడిన పసిడి ప్రియులు.. రోజు రోజుకీ పెరుగుతున్న రేట్స్ చూసి షాక్ అవుతున్నారు. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1200 పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 మాత్రమే తగ్గింది. భారీగా పెరిగి.. స్వల్పంగా తగ్గడంతో మరోసారి గోల్డ్ రేట్స్ పరుగులు పెడుతోంది. ఈ పెరుగుదలకు ముఖ్యకారణం శ్రావణ మాసం, పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం కావడమే అని నిపుణులు అంటున్నారు.
దేశీయంగా బుధవారం (ఆగష్టు 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,510 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.83,600గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.65,550
విజయవాడ – రూ.65,550
ఢిల్లీ – రూ.65,700
చెన్నై – రూ.65,550
బెంగళూరు – రూ.65,550
ముంబై – రూ.65,550
కోల్‌కతా – రూ.65,650
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,510
విజయవాడ – రూ.71,510
ఢిల్లీ – రూ.71,660
చెన్నై – రూ.71,510
బెంగళూరు – రూ.71,510
ముంబై – రూ.71,510
కోల్‌కతా – రూ.71,510
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.88,500
విజయవాడ – రూ.88,500
ఢిల్లీ – రూ.83,500
ముంబై – రూ.83,500
చెన్నై – రూ.88,500
కోల్‌కతా – రూ.83,500
బెంగళూరు – రూ.83,500