Site icon NTV Telugu

Mahabubabad: మోడల్ స్కూల్ లో దారుణం.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

Maharashtrarape

Maharashtrarape

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరి టీచర్ల ప్రవర్తన ఉపాధ్యాయ లోకానికే మాయని మచ్చగా మారుతోంది. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మోడల్ స్కూల్లో ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. విసిగిపోయిన విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

Also Read:IND vs ENG: ఆడే మ్యాచ్‌లను ఎంచుకోవడం ఏంటి?.. బుమ్రాపై భారత్ మాజీ కెప్టెన్‌ ఫైర్!

వెంటనే ఆ విద్యార్థిని పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బయ్యారం నామాలపాడు గ్రామంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ లో జరిగింది. ఓ ఉపాధ్యాయుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడని ఆరోపణు వెల్లువెత్తాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version