Site icon NTV Telugu

Viral Video: క్లాస్ రూంలో చిన్నారుల ఎదుట టీచరు చిందులు.. డ్యాన్స్ ఇరగదీసింది

Teacher Dance

Teacher Dance

Viral Video: తరగతి గదిలో విద్యార్థులతో టీచర్ భోజ్ పురి సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూంలో డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నారుల‌కు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచ‌ర్ వారి ఎదుట సినిమా పాట‌కు ఆడిపాడటం, విద్యార్థులను కూడా అందులో భాగం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ చేస్తున్న టీచర్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Read Also: Pet Dog Birthday: గ్రాండ్‎గా పెంపుడు కుక్క బర్త్ డే.. దాని డ్రస్ కాస్ట్ ఎంతో తెలుసా

ఈ వీడియోలో భోజ్‌పురి సాంగ్ ప‌త్లి క‌మ‌రియ మోరికు ఏకంగా క్లాస్‌రూంలోనే టీచ‌ర్ డ్యాన్స్ చేస్తుండ‌టం క‌నిపించింది. ఆపై టీచ‌ర్‌తో పాటు పిల్లలు కూడా కెమెరా వైపు చూస్తూ కేరింత‌లు కొడుతూ క‌నిపించారు. క్లాస్‌రూంలో డ్యాన్స్ చేసిన టీచ‌ర్‌పై త‌క్షణమే వేటు వేయాల‌ని కొంద‌రు యూజ‌ర్లు డిమాండ్ చేశారు. టీచ‌ర్లు ఆద‌ర్శప్రాయంగా ఉండాల‌ని ఐటెం నెంబ‌ర్లుగా కాద‌ని మ‌రో యూజ‌ర్ మండిప‌డ్డారు. గురువుల‌పై ఉన్న గౌర‌వాన్ని కోల్పోయేలా చేయ‌వ‌ద్దని మ‌రో యూజ‌ర్ హిత‌వు ప‌లికారు.

Exit mobile version