NTV Telugu Site icon

Beeda Ravichandra: టీడీపీ నేతలు ఇబ్బంది పడినా ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేశారు..

Deeda Ravi Chandra

Deeda Ravi Chandra

గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసింది అని ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారు.. ఎన్నికల సమయంలో.కొందరు పోలీస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు.. చంద్రగిరి నియోజకవర్గ ల్ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే నిదర్శనం అన్నారు. కొందరు స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మరణాయుధాలతో ఎందుకు వచ్చారు.. వీరిని పోలీసులు ఎలా అనుమతించారంటూ ఆయన మండిపడ్డారు. తిరుపతి ఎస్పీ పాటిల్ మాత్రం దీన్ని చిన్న ఘటనగా చెప్పడం దారుణం.. గూడూరులో కూడా పోలీసులు టీడీపీ నేతలపైనే దాడి చేశారు.. డిఎస్పీ సూ ర్యనారాయణ రెడ్డి, సిఐ వేణు గోపాల్ రెడ్డి, ఎస్ఐ అంజి రెడ్డిలు మితి మీరి ప్రవర్తించారు.. చిల్లకూరు, ఉదయగిరిలలో టీడీపీ అభ్యర్థులను పోలీసులు బెదిరించారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పేర్కొన్నారు.

Read Also: Tata Play-Amazon Prime: ఇకపై డీటీహెచ్‌లోనూ ప్రైమ్‌ వీడియో!

కాగా, తిరుపతి, నెల్లూరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు అని బీదా రవిచంద్ర అన్నారు. పల్నాడులో వైసీపీ- టీడీపీ నేతలు దాడులపై కూడా పోలీసులు కల్పించుకోలేదన్నారు. పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇబ్బంది పడినా ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేశారు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు కసిగా తరలివచ్చి ఓట్లు వేశారు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. 130కి పైగా స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది.. ఓటమి భయంతో వారు ఈ దాడులకు పాల్పడుతున్నారని బీదా రవిచంద్ర ఆరోపించారు.