Somireddy: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల విజయమని .ప్రజలే టీడీపీని గెలిపించారు. ప్రజలే ఎన్నికలను చేశారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోయారన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్రంగా విమర్శించారు.
Read Also: Venu Swamy: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. వేణు స్వామి సంచలన నిర్ణయం!
అన్ని రంగాలను విస్మరించారని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి ఎప్పుడూ లేని విజయాన్ని ప్రజలు అందించారని.. మాపై చాలా బాధ్యత ఉందని.. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
