NTV Telugu Site icon

Nuzvid: టీడీపీ ఖాతాలోకే నూజివీడు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పీఠం

Nuzvid

Nuzvid

Nuzvid: పలు నాటకీయ పరిణామాల మధ్య నూజివీడు మున్సిపల్ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది మాత్రమే మద్దతు అందించారు. దింతో వైసీపీకి పరాభవం తప్పలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ సొంత కౌన్సిలర్లే టీడీపీకి మద్దతు ప్రకటించడం విశేషం. మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చేరడంతో ఈ విజయం టీడీపీకి మరింత చేరువగా మారింది.

Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మపై ఊరమాస్ కామెంట్.. నితీష్ రెడ్డి ఇన్ స్టా స్టోరీ వైరల్

వైసీపీ అంచనాలను తారుమారు చేస్తూ, వారి సొంత నాయకులే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఫలితంతో నూజివీడు మున్సిపాలిటీలో టీడీపీ బలం మరింత పెరిగిందని విశ్లేషకులు ఆశిస్తున్నారు.