NTV Telugu Site icon

Yemmiganur: టీడీపీ పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ బీసీలకే కేటాయించాలి..

Bc Ikya Vedika

Bc Ikya Vedika

బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ బీసీ కులాలకు చెందిన ప్రముఖులు ఎమ్మిగనూరు పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ లో ఎన్నికల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో ఎమ్మిగనూరు మున్సిపల్ కార్పొరేషన్ మూడుసార్లు కార్పొరేటర్ గా పని చేసిన ఎంసీ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలి.. అలా ఇచ్చినట్లయితే ఒక బీసీని 1975 తర్వాత శాసనసభకు పంపినట్లు అవుతుందని వివిధ కులాలకు చెందిన నేతలు ముక్తకంఠంతో తెలియజేశారు.

Read Also: Tollywood Heroines : సోలోగా ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోయిన్స్ వీళ్లే…

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చెప్పినట్లు రాజకీయాలు ఒక మాస్టర్ కీ అనే విషయాన్ని ముందుకు తీసుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు బీసీలకు తెలుగుదేశం పార్టీలో సింహ భాగాన్ని కేటాయించారన్నారు. ఎందరినో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్ గా చేసిన ఘనత ఎన్టీఆర్ కి, నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని పేర్కొన్నారు. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్లయితే అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని బీసీ ఐక్ వేదిక సభ్యులు పేర్కొన్నారు. ఇక, బీసీ ఐక్యవేదిక అభ్యర్థనను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తప్పకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ను అన్ని అర్హతలు ఉన్న బీసీ నాయకుడికి కేటాయిస్తారని తెలియజేశారు. ఈ సమావేశాల్లో ఎమ్మిగనూరు పట్టణం గ్రామీణ పట్నం నందవరం మండలం, గోనెగండ్ల మండలం నుంచి బీసీ నాయకులు మల్లికార్జున కురుబ, ప్రభాకర్ నాయుడు వాల్మీకి, విజయ కొండయ్య కడయ్య, లక్ష్మీనారాయణ, దానకర్ణ ఇతరులు పాల్గొన్నారు.