Site icon NTV Telugu

Kuna Ravi Kumar: జగన్ పహల్గాం తీవ్రవాదులకంటే ప్రమాదకరమైన వ్యక్తి.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Kuna Ravi Kumar

Kuna Ravi Kumar

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గత ఐదేళ్లు ఫ్యాక్షన్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించారని.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరరాచక,విధ్వంస పూరిత పాలన సాగిందన్నారు. జగన్ ప్రభుత్వానికి జూన్ 4 న రాష్ట్ర ప్రజలు సమాధి చేశారని చెప్పారు. వైసీపీ వెన్నుపోటు దినం చేయటం కన్నా సంవత్సరీకం చేసుకోవాలని.. జగన్ లాంటి దౌర్భాగ్య పాలనను చూసి ప్రజలు గత యేడాది జూన్ 4 న పిండం పెట్టారన్నారు. జగన్ వెన్నుపోటుకు ప్రతిరూపం.. సీఎం గా ఉంటూ పులివెందులకు త్రాగునీరు ఇవ్వలేని వెన్నుపోతుదారుడు జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎత్తుకుని పెంచిన బాబాయిన హత్య చేయించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. బాబాయి వివేకా కుటుంబానికి వెన్నుపోటు పొడిచినవాడు జగన్ అని వ్యాఖ్యానించారు. ఆస్తి కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారన్నారు.

READ MORE: Tata Harrier EV: సింగిల్ ఛార్జ్.. 627 కి.మీ. రేంజ్‌, లెవల్ 2 ADAS ఫీచర్లతో టాటా హ్యారియర్ EV లాంచ్..!

“జగన్ పహల్గాం తీవ్రవాదులకంటే ప్రమాదకరమైన వ్యక్తి.. డబ్బుకోసం అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడుగడతాడు. అరకు ఏజెన్సీలో కాఫీ తోటలు నరికి గంజాయి పండించిన ఘనత జగన్ ది. తెనాలిలో గంజాయి ముఠాలను పోలీసులు కట్టడి చేస్తే అదికూడా జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నాడు. గంజాయి ముఠా సభ్యులను,రౌడీ షీటర్ల ను పరామర్శించటానికి జగన్ వెళ్తున్నాడు అంటే ప్రజలు ఆయన మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. జగన్ అసలు రాజకీయ నాయకుడేనా? ప్రజాస్వామ్యంలో జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలు చేయటానికి అర్హుడా అని అడుగుతున్నా… రేపు వైసీపీ ప్రథమ వర్ధంతి.. రాష్ట్ర ప్రజలకి జగన్ ధరిద్రం వదిలిన రోజు.. అన్ని స్కాం లకు తాడేపల్లి ప్యాలస్ అడ్డాగా కనిపిస్తుంది.. త్వరలో జగన్ అరెస్టు అవ్వటం ఖాయం..” అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.

READ MORE: IPL 2025 Final PBKS: బ్యాటింగ్ ఓకే.. మరి బౌలింగ్ పరిస్థితేంటి..? కొత్త ఛాంపియన్‌గా పంజాబ్ నిలుస్తుందా..?

Exit mobile version