NTV Telugu Site icon

Nara Lokesh: నారా లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలి: టీడీపీ ఎమ్మెల్యే

Mla Adireddy Srinivas

Mla Adireddy Srinivas

ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని కూడా వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నా అని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను స్వాగతిస్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని, వర్మ లేదా ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని పేర్కొన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దానికి ప్రాధాన్యం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి చెప్పారు.

రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘నారా లోకేష్‌ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే స్వాగతిస్తాను. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారు. వర్మ లేదా మా పార్టీలో ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని
ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దానికి ప్రాధాన్యం’ అని అన్నారు.

Also Read: Land Grabbing: మా ల్యాండ్ కబ్జా చేశారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు!

‘మరో 15 ఏళ్లు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. నారా లోకేష్ ఇప్పటికే నిరూపించుకున్నారు. ఎన్డీఏ కూటమిలో అందరూ బాగానే ఉన్నారు. వైసీపీ పిల్ల సైకోలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈనెల 23న నారా లోకేష్ పుట్టినరోజు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ సహకరించాలి’ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.