సామాజిక సాధికారత పేరిట వైసీపీ నేటి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత జవహర్ మాట్లాడుతూ.. సామాజిక బస్సు యాత్రలో కోడి కత్తి శ్రీను ఫోటో పెట్టాలన్నారు. మరో ప్రక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం ఫోటో ఉంచాలన్నారు. దళితులపై దాడులు చేసిన వారిని వైసీపీ దూరంగా పెట్టి యాత్ర చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. రద్దైన 120 పధకాలు ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా..? అని ఆయన ప్రశ్నించారు. జగన్ దళిత ద్రోహి కాదని చెప్పగలరా..? అని ఆయన అన్నారు. వర ప్రసాద్ అనే వ్యక్తికి గుండు ఎందుకు కొట్టించారో చెప్పాలని, 1.40 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. సామాజిక యాత్రకాదు సమాజంపై దండ యాత్ర అని జవహర్ వ్యాఖ్యానించారు. జగనుకు.. వైసీపీకి యాత్ర చేసే అర్హత లేదంటూ విమర్శించారు.
Also Read : Zomato: జొమాటో వుమెన్ డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్
ఇది ప్రజల కోసం జరుగుతున్న సామాజిక యాత్ర కాదని… ప్రజలపై జగన్ చేస్తున్న దండయాత్ర అని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేసారు. అసలు వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం అభివృద్ది చేసిందని ఈ యాత్ర చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇంతకాలం ప్రజా సంక్షేమాన్ని మరిచిన ఆ పార్టీకి ఎన్నికలు రాగానే సామాజిక సాధికారత గుర్తొచ్చిందన్నారు. అసలు జగన్ కు, వైసీపీ నాయకులకు ఏ యాత్రలు చేసే అర్హత లేదని జవహర్ అన్నారు. వైసీపీ యాత్ర చేపట్టే బస్సుకు ఓవైపు కోడి కత్తి శ్రీను ఫోటో… మరోవైపు ఎమ్మెల్సీ చేతిలో చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం ఫోటో ఉంచాలన్నారు జవహర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితులపై దాడులు చేసిన వారిని ముందుగా వైసీపీ దూరం పెట్టాలని… ఆ తర్వాతే ఏ సామాజిక యాత్ర అయినా చేపట్టవచ్చని అన్నారు. బస్సు యాత్ర కాదు ఏం చేసినా ప్రజలు వైసిపిని, వైఎస్ జగన్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి.
Also Read : CM Jagan : నేడు తూ.గో జిల్లాలో సీఎం జగన్ పర్యటన