NTV Telugu Site icon

TDP-Janasena Manifesto Committee: ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటుచేసిన టీడీపీ – జనసేన

Tdp Janasena

Tdp Janasena

TDP-Janasena Manifesto Committee: వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు.. అందులో భాగంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నారు.. ఇప్పటికే టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలు రెండు సార్లు సమావేశం అయ్యాయి.. ఉమ్మడిగా పూర్తిస్తాయి మేనిఫెస్టో రూపకలప్పనే ప్రధాన అజెండా రెండో సమావేశం జరిగింది.. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు టీడీపీ – జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు.

Read Also: Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!

మొత్తం ఆరుగురు సభ్యులతో టీడీపీ – జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు అయ్యింది.. ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభిలకి చోటు దక్కగా.. జనసేన పార్టీ నుంచి వర ప్రసాద్, ముత్తా శశిధర్, శరత్‌ను ఎంపిక చేశారు.. ఇక, ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ – జనసేన జేఏసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది.. కాగా, టీడీపీ – జనసేన జేఏసీ రెండో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.. వచ్చే జేఏసీ సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఈ నెల 14,15,16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు జరుగుతాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.