NTV Telugu Site icon

చంద్రబాబు దీక్ష.. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదిక

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా.. కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల పాటు దీక్ష కొనసాగించనున్నారు పార్టీ అధినేత.. మరోవైపు.. చంద్రబాబు దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు తమ్ముళ్లు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదిక ఏర్పాటు చేశారు.. ఇక, వివిధ జిల్లాల నుంచి దీక్షకు మద్దతుగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలి రానున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. మరోవైపు.. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే టీడీపీకి గుంటూరు అర్బన్ పోలీసుల నోటీసులు ఇచ్చారు.. అయితే, నేతలు.. కార్యకర్తలని పార్టీ కార్యాలయం వరకు పోలీసులు అనిమతిస్తారా అనేది అనుమానంగా మారింది.