NTV Telugu Site icon

Chandrababu: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉదయమే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్ర పునర్మిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని చంద్రబాబు అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చి బీఫారాలను అందజేసింది. టీడీపీ అభ్యర్థులు కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గెలిచి కచ్చితంగా లోక్‌సభ, అసెంబ్లీకి వచ్చి తీరాలన్నారు.

Read Also: YSRCP: రేపు వైసీపీ కీలక సమావేశం.. మేనిఫెస్టో ఫైనల్ చేయనున్న సీఎం జగన్!

ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన తెలుగుదేశం

*ఉండి బీఫారం రఘురామకృష్ణం రాజుకు అందించిన చంద్రబాబు.

*పాడేరు బీఫారం గిడ్డి ఈశ్వరికి అందచేత.

*మాడుగుల బీ ఫారం బండారు సత్యనారాయణ మూర్తికి అందచేత.

*వెంకటగిరి బీఫారం కురుగొండ్ల రామకృష్ణ కు అందచేత.

*మడకశిర బీఫారం ఎం ఎస్ రాజుకు అందచేసిన చంద్రబాబు