NTV Telugu Site icon

TCL Tv: క్రికెట్ అభిమానులకు సువర్ణ అవకాశం.. టీవీ కొనండి మ్యాచ్ టికెట్స్ గెలుచుకోండి!

Tcl

Tcl

TCL Tv: క్రికెట్ ప్రేమికుల కోసం TCL ఇండియా ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఐపీఎల్ 2025 సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు TCL తన కస్టమర్లకు ఆసియా కప్ టికెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే వారంవారీ ప్రత్యేక వౌచర్లను అందిస్తూ క్రికెట్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. TCL ప్రకారం, క్రికెట్ భారతదేశ సాంస్కృతిక జీవితంలో కీలక భాగమని తెలిపింది. ఐపీఎల్ దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఈ పోటీకి సంబంధించిన ఉత్సాహాన్ని ఉపయోగించుకుని, TCL తన ప్రీమియం టీవీలను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా 55-అంగుళాల లేదా అంతకంటే పెద్ద స్క్రీన్ కలిగిన QD-Mini LED టీవీలను ప్రత్యేకంగా ప్రమోట్ చేసేందుకు సిద్ధమైంది.

Read Also: Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందిః నితిన్

ఈ పోటీ ద్వారా కస్టమర్లను మరింత ఆకర్షించి, భారత మార్కెట్‌లో వినియోగదారులను పెంచుకోవాలని TCL లక్ష్యంగా పెట్టుకుంది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ TCL బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో, ఈ ప్రచారం మరింత విశ్వసనీయతను సంతరించుకుంది. సోషల్ మీడియా ప్రచారాలు, రిటైల్ ప్రమోషన్లు, డిజిటల్ భాగస్వామ్యాలతో ఈ క్యాంపెయిన్‌ను TCL మరింత బలంగా రూపొందించింది. ఇక ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు ఎలా నమోదు చేసుకోవాలని విషయానికి వస్తే..

Read Also: UPI: యూపీఐ సర్వర్ డౌన్ .. ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లు

TCL 55-అంగుళాల లేదా అంతకంటే పెద్ద QD-Mini LED లేదా TCL TV కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆ TCL టీవీలో IPL మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటో లేదా వీడియో తీయాలి. ఆ వీడియో లేదా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో @tcl_india ట్యాగ్ చేస్తూ లేదా ఫేస్‌బుక్‌లో TCL Electronics (IN) ట్యాగ్ చేస్తూ #WatchWithTCL హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. ఆపై ఎంట్రీ పూర్తి చేయడానికి స్కాన్ చేయాల్సిన ఫారమ్ ద్వారా మీ వివరాలు సమర్పించాలి. మే 25, 2025 పోటీ చివరి తేదీ. ఇలా అంతవరకు ప్రతి వారం 10 మంది విజేతలకు ప్రత్యేక వౌచర్లు అందించబడతాయి. అలాగే 10 మంది గ్రాండ్ ప్రైజ్ విజేతలకు ఆసియా కప్ టికెట్లు లభిస్తాయి.