NTV Telugu Site icon

GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..

Railways

Railways

జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైల్వే సేవలను బలోపేతం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లతో సహా రైల్వే సేవలను వస్తు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లతో పాటు, క్లోక్ రూమ్ సేవలు, వెయిటింగ్ రూమ్‌లు, రిటైరింగ్ రూమ్‌లు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవలు వంటి సేవలు కూడా పరోక్ష పన్ను విధానంలో ఎటువంటి లెవీలను ఆకర్షించవువని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంట్రా-రైల్వే సరఫరా, వస్తువుల అమ్మకం కూడా GST నుంచి మినహాయించారు.

READ MORE: Sri Lanka: “భారత్ చేసిన ఆర్థిక సాయం వల్లే సంక్షోభం నుంచి కోలుకున్నాం”

బ్రిటిష్ వారి దోపిడీ కార్యక్రమం కోసం రైళ్లను ఆరంభించినప్పటికి కాలక్రమేణా రైలు భారత సామాన్యుడి జీవనానికి ఊతంగా నిలిచింది. నామమాత్రపు రుసుములతో సుదూరపు ప్రయాణాలకు సైతం రైలు ద్వారా సులభమైంది. నేడు రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. నెత్తురోడుతున్న రోడ్లు వాహన చోదకుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ సంక్లిష్ట స్థితిలో రైల్వే వ్యవస్థ సురక్షిత ప్రయాణానికి ఊతంగా నిలిచింది. చాలా మంది ప్రయాణికులు రైల్వేపై ఆధారపడుతున్నారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయిస్తూ..కేంద్రం తిపికబురు చెప్పింది.

Show comments