ప్రజలకు టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా వెరైటీ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో జంతువులపై దయ చూపాలని ఆయన అభ్యర్థించారు. వర్షాకాలంలో వాహనదారులు ఏం తెలుసుకోవాలి అనేది రతన్ టాటా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. వర్షాకాలం వచ్చిందంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రాణభయం స్టార్ట్ అవుతుంది. రోడ్డుపై కుక్కలు లేదా ఇతర జంతువులు, పక్షుల మృతదేహాలు మనకు నిత్యం ఎక్కడో ఒక చోట దర్శనమిస్తుంటాయి. జంతు హక్కులు ఇంకా వాటి రక్షణ గురించి అవగాహన పెంచే ఎన్నో పోస్ట్‌లను క్రమం తప్పకుండా రతన్ టాటా షేర్ చేస్తుంటారు.
Read Also: Beauty Tips: పటికతో ముఖంలో ముడతలు, మొటిమల మచ్చలు మాయం..!
అయితే.. వీధికుక్కలు, జంతువుల గురించి రతన్ టాటా పోస్ట్‌లు ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వర్షాకాలంలో వీధి కుక్కల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వర్షం నుండి తడవకుండా వాహనాల కింద లేదా దుకాణాల దగ్గర అవి తల దాచుకునేందుకు వస్తుంటాయి.. ఇలాంటి సమయంలో వాహనం కింద పడుకుని ఉన్న వీధి కుక్కలు, జంతువులును డ్రైవర్ గమనించకుంటే చనిపోతాయని ఆయన తెలిపారు.
Read Also: Flipkart: గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్ లోన్..
దీనిని నివారించాలంటే వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రమాదంలో అవి వికలాంగులుగా మారొచ్చు.. లేదా ఒక్కోసారి చనిపోవచ్చు అని ఆయన తెలిపారు. కాబట్టి డ్రైవింగ్ చేసే ముందు వాహనం కింద భాగాన్ని చెక్ చేయండి అని రతన్ టాటా అన్నారు. రతన్ టాటా చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 14 లక్షలకు పైగా లైక్‌లు, రీపోస్టులు.. వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి.
https://twitter.com/RNTata2000/status/1676133295015247875
