Site icon NTV Telugu

Tata Safari-Harrier facelift: అక్టోబర్ 6 నుంచి టాటా సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..

Tata Safari Harrier Facelift

Tata Safari Harrier Facelift

Tata Safari-Harrier facelift: భారతీయ ఆటో దిగ్గజం టాటా దూసుకుపోతోంది. ఇప్పటికే టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ని తీసుకువచ్చిన ఈ సంస్థ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ కార్లు అయిన సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకురాబోతోంది. మరిన్ని అధునాతన ఫీచర్లతో, టెక్నాలజీని ఈ కార్లలో ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఈ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు కార్లకు సంబంధించిన బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఫీచర్లు ఇవే:

కొత్తగా రానున్న హారియర్, సఫారీ కార్లలో ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్, బంపర్ పూర్తిగా స్టైలిష్ గా మారబోతోంది. వెనక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్ అప్డేట్ ఉంటుంది. కొత్త స్టీరింగ్ వీల్‌ను ఇల్యూమినేటెడ్ లోగోతో (కొత్త నెక్సాన్‌లో లాగానే) మరియు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పొందవచ్చు. ఫిబ్రవరిలో, టాటా మోటార్స్ సఫారి, హారియర్ రెండింటికీ కొత్త 360-డిగ్రీ కెమెరా,10.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చింది.

Read Also: Ram Pothineni: హీరోయిన్ అనుపమతో రామ్ పెళ్లి.. ఎవడ్రా చెప్పింది మీకు..?

ఇప్పటికే సఫారీ, హారియర్ కార్లు 10 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, డోర్ ఓపెన్ అలర్ట్, ట్రాఫిక్ సైన్ గుర్తింపు, వెనుక క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, రేర్ కొలిషన్ వార్నింగ్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఏ కార్లతో పోటీ అంటే:

అయితే పవర్ ట్రెయిన్ విషయాని వస్తే ఎలాంటి మార్పులే లేకుండా ఫేస్‌లిప్టు వెర్షన్లు ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యుయల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్లతో 2.0 లీటర్ క్రయోటెక్ డిజిల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. టాటా సఫారీ మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ కార్లకు పోటీని ఇవ్వగా.. టాటా హారియర్ మహీంద్రా స్కార్పియో, ఎంజీ హెక్టార్లకు పోటీగా ఉండబోతోంది.

Exit mobile version