Multibagger Tata Stocks: టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటి. దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ సమూహం భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో ముందు వరుసలో నిలిచింది. స్టాక్ మార్కెట్‌లోనూ టాటా గ్రూప్‌కు మంచి ఆదరణ ఉంది. టాటా మోటార్స్ నుండి టైటాన్ వరకు, టాటా షేర్లు ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు చాలా డబ్బు సంపాదించిపెట్టాయి. రాకేష్ జున్‌జున్‌వాలాను దేశీయ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా మార్చడంలో, టాటా గ్రూప్ షేర్ టైటాన్‌కు పెద్ద సహకారం ఉంది. టాటా గ్రూప్ స్టాక్ మార్కెట్ స్థిరంగా మల్టీబ్యాగర్‌గా నిరూపించబడుతోంది.
Read Also:Gold Today Price: మగువలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని సంవత్సరాలుగా తమ పెట్టుబడిదారులను ధనవంతులను చేసిన వివిధ టాటా స్టాక్‌లలో టాటా పవర్ ప్రముఖమైన పేర్లలో ఒకటి. సోమవారం ట్రేడింగ్‌లో దీని ధర దాదాపు 1 శాతం పడిపోయి రూ.233.45 వద్ద ముగిసింది. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాల డేటా పరిశీలనలోకి తీసుకుంటే టాటా పనితనం అద్భుతంగా ఉంది.
Read Also:IND vs WI 3rd T20: మూడో టీ20లో భారత జట్టు ఇదే.. సంజూ స్థానంలో జైస్వాల్!
గత 5 రోజుల ప్రకారం టాటా గ్రూప్ ఈ షేర్ మూడున్నర శాతం నష్టాల్లో ఉంది. దాని ధర ఒక నెలలో సుమారు 4 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో టాటా పవర్ షేర్ ధర దాదాపు 13 శాతం లాభపడింది. దీర్ఘకాలికంగా పరిశీలిస్తే మాత్రం విచిత్రంగా కనిపిస్తోంది. గత 3 సంవత్సరాలలో ఈ స్టాక్ దాదాపు రూ. 28 నుండి రూ. 235 వరకు ప్రయాణించింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం అంటే మే 2020లో టాటా పవర్ ఒక షేరు ధర కేవలం రూ. 28.50. అది ఇప్పుడు రూ. 233.45కి చేరుకుంది. ఈ స్టాక్ కూడా ఒకానొక సమయంలో రూ.280 స్థాయిని దాటేసింది. ఈ విధంగా టాటా పవర్ ధర 10 రెట్లు పెరిగింది.