NTV Telugu Site icon

Tata Play-Amazon Prime: ఇకపై డీటీహెచ్‌లోనూ ప్రైమ్‌ వీడియో!

Tata Play Amazon Prime

Tata Play Amazon Prime

Tata Play Joins Hands With Amazon Prime: కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టాటా ప్లే.. అమెజాన్‌ ప్రైమ్‌తో జట్టు కట్టింది. డీటీహెచ్‌, బింజ్ కస్టమర్లకు ప్రైమ్‌ వీడియో ప్రయోజనాలను టాటా ప్లే అందించనుంది. దీంతో వివిధ ప్యాక్‌లతో సబ్‌స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు అటు ప్రైమ్‌ లైట్ కంటెంట్‌ను వీక్షించొచ్చు. టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ.. యాప్‌లను బండిల్ చేయడానికి ఇదో కొత్త మార్గం అని అన్నారు.

టాటా ప్లే డీటీహెచ్‌ సబ్‌స్క్రైబర్లు నెలకు రూ.199తో ప్రారంభమయ్యే ఏ ప్యాక్‌ను అయినా ఎంచుకోవచ్చు. ఇందులో వివిధ రకాల టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్‌ లైట్‌ కంటెంట్‌ అందుబాటులో ఉటుంది. బింజ్‌ కస్టమర్లు అయితే ప్రైమ్‌ లైట్‌తో కలిపి 30కి పైగా ఓటీటీ యాప్‌లను ఎంచుకోవచ్చు. ప్రైమ్‌ వీడియో కలిపి ఆరు ఓటీటీలను ఎంచుకుంటే.. నెలకు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. 33 యాప్‌లు కావాలనుకుంటే.. రూ.349 చెల్లించాలి. ఈ కొత్త ప్లాన్లలో మీకు నచ్చిన ఓటీటీలను ఎంచుకునే అవకాశం ఉంది.

Also Read: Sonakshi Sinha: నా కండిషన్స్‌కు అంగీకరిస్తేనే.. సినిమాకు సైన్‌ చేస్తాను!

టాటా ప్లేలో ప్రైమ్‌ లైట్‌తో కూడిన ప్యాకేజీలు ఎంచుకున్నవారికి వీడియో కంటెంట్‌తో పాటు అమెజాన్‌ ఈకామర్స్‌ షిప్పింగ్‌, షాపింగ్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రైమ్‌ లైట్‌తో ఆర్డర్‌ చేసిన రోజు లేదా తర్వాత రోజు డెలివరీ వస్తుంది. సేల్‌లో ఓ రోజు ముందుగానే పాల్గొనే అవకాశం ఉంటుంది. కొత్త ప్లాన్లతో పాటు టాటా ప్లే డీటీహెచ్‌ కస్టమర్లు అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రాయితీ ధరతో పొందొచ్చు. వీరికి షిప్పింగ్‌, షాపింగ్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌, ప్రైమ్‌ గేమింగ్‌ ప్రయోజనాలు సహా ఐదు స్క్రీన్లపై ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది.

 

 

Show comments