Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్.ఈవీకి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. కస్టమర్లకు మరిన్ని ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ వంటి రెండు కొత్త డ్యుయల్-టోన్ రంగులను పరిచయం చేసింది. ఈ రంగులు నెక్సాన్.ఈవీ 45 శ్రేణిలోని అన్ని వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రంగులు క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లలో కనిపిస్తాయి. ఇందులో ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లకు బ్లాక్ రూఫ్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్‌కు వైట్ రూఫ్ ఇచ్చారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రిస్టిన్ వైట్, డేటోనా గ్రే, ఎంపవర్డ్ ఆక్సైడ్ రంగులతో పాటు ఇప్పుడు ఈ కొత్త షేడ్స్ సైతం చేరడంతో కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ రంగులు మాత్రం కేవలం 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ మోడల్‌కే పరిమితం చేశారు. 30 కిలోవాట్ అవర్ వెర్షన్‌లో లభించదని కంపెనీ తెలిసింది.
READ MORE: CM Chandrababu: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
నెక్సాన్.ఈవీ 45లో 46.08 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 489 కిలోమీటర్ల వరకు (MIDC ప్రమాణాల ప్రకారం) ప్రయాణించగలదని టాటా చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 144 బీహెచ్‌పీ పవర్, 215 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. వేగం విషయానికి వస్తే, కేవలం 8.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత.. చార్జింగ్ పరంగా బాగా ఉపయోగ పడుతుంది. ఇంట్లో అమర్చుకునే 7.2 కిలోవాట్ ఏసీ వాల్‌బాక్స్ చార్జర్ ద్వారా 10 నుంచి 100 శాతం చార్జ్ చేయడానికి సుమారు 6 గంటల 36 నిమిషాలు పడుతుంది. అదే 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జర్ ఉపయోగిస్తే కేవలం 40 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. అంతేకాదు, ఇది వాహనం నుంచి వాహనానికి విద్యుత్ అందించే V2V, అలాగే బయటి పరికరాలకు కరెంట్ ఇవ్వగల V2L ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది.
READ MORE: Karnataka: ఓలా, ఉబర్, ర్యాపిడోలకు గుడ్‌న్యూస్ చెప్పిన హైకోర్టు..
కారు లోపలి భాగం విషయానికి వస్తే.. నెక్సాన్.ఈవీ పూర్తిగా ఆధునికంగా ఉంది. ఇందులో 12.30 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల హెచ్‌డీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అదనంగా 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫయర్, టైప్-సీ పోర్టులు, సన్‌రూఫ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వాయిస్ కమాండ్స్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ ఇవ్వడం టాటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
