Site icon NTV Telugu

Tata Harrier EV Stealth Edition: టాటా హారియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 627KM రేంజ్!

Tata Harrier

Tata Harrier

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టైలిష్ డిజైన్, అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరుతో భారతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యింది. ఈ ఎడిషన్ బ్యాక్ వీల్ డ్రైవ్, క్వాడ్ వీల్ డ్రైవ్ అనే రెండు ఆప్షన్స్ లో వస్తోంది. ఈ ఎడిషన్ మొత్తం నాలుగు వేరియంట్లను కలిగి ఉంది. వీటిలో ఎంపవర్డ్ 75 స్టీల్త్, ఎంపవర్డ్ 75 స్టీల్త్ ACFC, ఎంపవర్డ్ QWD 75 స్టీల్త్, ఎంపవర్డ్ QWD 75 స్టీల్త్ ACFC వేరియంట్‌లు ఉన్నాయి. టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.28.24 లక్షల నుంచి ప్రారంభమైతే.. దాని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.30.23 లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

Also Read:Indo-Pak Border: సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం.. మిస్టరీగా డెత్!

టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్‌లో క్రేజీ ఫీచర్లను అందించారు. ఇందులో బూస్ట్ మోడ్, ఆఫ్ రోడ్ అసిస్ట్, నార్మల్, స్నో, గ్రాస్, మడ్, ఇసుక, రాక్, కస్టమ్ టెర్రైన్ మోడ్‌లు, మ్యాట్ స్టెల్త్ బ్లాక్ పెయింట్ స్కీమ్, కార్బన్ లెదరెట్ సీట్లు, ఇంటీరియర్, 19 అంగుళాల పియానో ​​బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఆటో పార్క్ అసిస్ట్, లెవల్-2 ADAS, 540 డిగ్రీ వ్యూ కెమెరా, 36.9 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, JBL 10 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, యాంబియంట్ లైట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. టాటా 75 KWh బ్యాటరీతో హారియర్ EVని అందించింది. ఇది SUV కి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కి.మీ MIDC రేంజ్ ని ఇస్తుంది. వాస్తవ రేంజ్ 480 నుంచి 505 కి.మీ. దీనిలో అందించిన PMSM మోటార్ 238 PS పవర్, 315 న్యూటన్ మీటర్ టార్క్ ని ఇస్తుంది.

Exit mobile version