Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pachimirchi Avakaya: ఆవకాయ అంటే చాలామందికి మామిడి ఆవకాయే గుర్తుకు వస్తుంది. కానీ పచ్చిమిర్చితో చేసే ఆవకాయ కూడా అద్భుతమైన రుచిని ఇస్తుంది. బజ్జీ మిరపకాయలతో చేసే ఈ పచ్చిమిర్చి ఆవకాయ కారం ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. సరైన విధంగా చేస్తే మిరపకాయలు అస్సలు కారం లేకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఒక మిరపకాయ, కొంచెం ఆవకాయ గుజ్జు వేసుకుని తింటే నెయ్యి కూడా అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పచ్చడిని సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చెసాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* బజ్జీ మిరపకాయలు – పావు కిలో
* నిమ్మకాయలు – 3
* మెంతులు – 1 టేబుల్ స్పూన్
* ఆవాలు – 2 టేబుల్ స్పూన్లు
* కారం – అర కప్పు
* ఉప్పు – పావు కప్పు (తగ్గించి లేదా పెంచుకోవచ్చు)
* వెల్లుల్లి రెబ్బలు – 30 నుంచి 40
* పల్లీ నూనె – 1 కప్పు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తయారీ విధానం:
మిరపకాయలను సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఫ్రెష్‌గా గట్టిగా ఉన్న బజ్జీ మిరపకాయలను ఎంపిక చేసుకోవాలి. పగుళ్లు ఉన్న కాయలను తీసుకోకూడదు. వాటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తర్వాత ప్రతి మిరపకాయను మధ్యలో కోసి గింజలను నిదానంగా తీసేయాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి కారం తగ్గి తినడానికి చాలా బాగుంటుంది.
నిమ్మరసం కలపడం:
గింజలు తీసిన మిరపకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. నిమ్మరసం కలపడం వల్ల మిరపకాయలలో ఉన్న కారం తగ్గుతుంది. అలాగే ఇది సహజమైన ప్రిజర్వేటివ్‌లా పనిచేసి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు సహాయపడుతుంది.
ఆవాల పొడి తయారీ:
స్టవ్‌పై పాన్ పెట్టి ముందుగా మెంతులను సన్నని మంటలో ఎర్రగా వేయించాలి. తర్వాత అందులో ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడే పచ్చడికి అసలైన రుచిని ఇస్తుంది.
పచ్చడి కలిపే విధానం:
ఒక పెద్ద బౌల్లో కారం, ఉప్పు, ఆవాల-మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత బుడ్డల (పల్లీ) నూనె పోసి బాగా కలపాలి. ఈ పచ్చడికి పచ్చి పల్లీ నూనె వాడితేనే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు నిమ్మరసంలో నానబెట్టిన మిరపకాయలను ఇందులో వేసి చేత్తోనే నిదానంగా కలపాలి. ప్రతి మిరపకాయకు కారం మిశ్రమం బాగా పట్టేలా చూసుకోవాలి.
పచ్చడి ఊరడం:
పచ్చడిని కలిపిన తర్వాత మూతపెట్టి ఒక రోజు పాటు ఊరనివ్వాలి. మరుసటి రోజు నూనె పైకి తేలుతుంది. అప్పుడు మరోసారి నిదానంగా కలిపి ఉప్పు లేదా పులుపు తక్కువగా ఉంటే అవసరానికి తగ్గట్టు కలుపుకోవచ్చు. మళ్లీ ఇంకో రోజు ఊరనిచ్చి గ్లాస్ జాడీల్లో నిల్వ చేసుకోవాలి. పచ్చడిపై నూనె పొర కనిపించేలా ఉండాలి. పచ్చడి తీసే స్పూన్ తడి లేకుండా చూసుకుంటే బయటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఆరు నెలలకుపైగా తాజాగా ఉంటుంది. అంతే ‘పచ్చిమిర్చి ఆవకాయ’ రెడీ.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..