Site icon NTV Telugu

Tarun: రీఎంట్రీకి సిద్దమైన తరుణ్.. తల్లి రోజా రమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Tharun

Tharun

టాలీవుడ్ హీరో తరుణ్ అనతి కాలంలోనే చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాడు. సోషల్ నెట్‌వర్క్‌ లలో కూడా యాక్టివ్ గా ఉండడు. హీరో తరుణ్ పూర్తిగా అదృశ్యమయ్యాడని చెప్పవచ్చు. అయితే తరుణ్ పెళ్లి గురించి చాలా వార్తలు ఈ మధ్య బయటికి వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన స్పందించకపోవడంతో పాటు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తరుణ్ తల్లి క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Aalavandhan OTT: 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న కమల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తాజాగా తరుణ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అభిమానులకు శుభవార్త అంటూ ప్రకటించారు. తరుణ్ త్వరలో సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని.. దాని గురించే ఆలోచిస్తున్నామని., ఎలాంటి కథలు చేయాలనేది తరుణ్ నిర్ణయిస్తారు అంటూ తెలిపింది.

ఇందుకు సంబంధించి అతి త్వరలో ఒక పెద్ద సప్రైజ్ ప్రకటిస్తాడని తెలిపింది. మరి తరుణ్ ప్రస్తుతం సినిమాల్లో నటించనందున ఏం చేస్తాడని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ., “మాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి” అని తల్లి రమణి అన్నారు. స్థిరాస్తితో పాటు వ్యాపారాలు కూడా ఉండడంతో తరుణ్ చాలా ఏళ్లుగా వాటిల్లో చేరి లాభాలు గడిస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఏది పడితే అది చేస్తే ఫేమ్ రాదు కాబట్టి.. రీఎంట్రీ విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో తరుణ్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు.

Exit mobile version