Keeda Cola : తరుణ్ భాస్కర్ “కీడా కోలా” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడాకోలా’.ఈ చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య నవంబర్ 3న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే, ఈ కీడాకోలా మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ డ్రామాను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. అయితే, ఇప్పుడు కీడా కోలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.కీడాకోలా సినిమా డిసెంబర్ 29వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (డిసెంబర్ 19) అధికారంగా వెల్లడించింది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు మాత్రం ఒక రోజు ముందుగా అంటే.. డిసెంబర్ 28న ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది.
ఇక సాధారణ సబ్‍స్క్రైబర్లు డిసెంబర్ 29 నుంచి ఈ మూవీని ఆహా ఓటీటీలో చూడొచ్చు. ఈ విషయాన్ని ఆహా స్వయంగా పేర్కొంది.”దరిద్రానికి దగ్గరగా.. పైసల్‍కి దూరంగా.. మజాక్‍లో బతుకుతున్న కొన్ని జీవితాలను సూడడానికి రెడీగా ఉండండి. పక్కా నవ్వుల దాడి కీడాకోలా.. డిసెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు 24 గంటల ముందే యాక్సెస్‍కు వస్తుంది” అని ఆహా ఫన్నీగా ఈ కీడాకోలా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.ఓ కోలా కూల్‍డ్రింక్ బాటిల్‍లో బొద్దింక రావడం.. దాని ద్వారా కంపెనీ యజమానిని బెదిరించి డబ్బు గుంజాలని కొన్ని గ్రూపులు ప్రయత్నించడం చుట్టూ ఈ కీడాకోలా మూవీ తిరుగుతుంది. కామెడీ, క్రైమ్, కొన్ని ట్విస్టులు మరియు యాక్షన్ వంటి చాలా అంశాలతో ఈ మూవీని దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు. ఈ నగరానికి ఏమైంది మూవీ తర్వాత డైరెక్షన్‍కు ఏకంగా ఐదేళ్ల విరామం తీసుకొని ఈ సినిమాను రూపొందించారు.కీడా కోలా సినిమాలో చైతన్యరావ్, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్ మరియు విష్ణు కీలకపాత్రలు పోషించారు.
Also Read
Daridraniki deggara ga
Paisal ki dhooramga
Mazak la brathukuthunna konni jeevithalanu sudadaniki ready ga undandi…#KeedaaCola🪳,a pakka laugh riot Premieres Dec 29.🤩24 hours early access to aha Gold subscribers
@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @VivekSudhanshuK… pic.twitter.com/fGHRGINS6B
— ahavideoin (@ahavideoIN) December 19, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!