Site icon NTV Telugu

Tara Sutaria-Veer Pahariya: బ్రేక్‌అప్.. విడిపోయిన స్టార్ సెలబ్రిటీ ప్రేమ జంట!

Tara Sutaria Veer Pahariya

Tara Sutaria Veer Pahariya

Tara Sutaria and Veer Pahariya Break Up: బాలీవుడ్‌ 2025లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త జంట తారా సుతారియా – వీర్ పహారియా ఇప్పుడు విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన ఈ జంట కొద్ది కాలానికే విడిపోవడం అభిమానులను షాక్‌గా గురించింది. ఫిల్మ్‌ఫేర్ కథనం ప్రకారం.. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారని నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తారా కానీ, వీర్ కానీ అధికారికంగా స్పందించలేదు. విడిపోవడానికి గల అసలు కారణం కూడా ఇంకా బయటకు రాలేదు.

READ MORE: 165Hz డిస్‌ప్లే, 9,000mAh బ్యాటరీతో మరో మిస్టరీ OnePlus ఫోన్..?

ఇద్దరి మధ్య సంబంధం బలంగా ఉందనుకున్న సమయంలోనే ఓ అనూహ్య ఘటన చర్చనీయాంశమైంది. ఏపీ ధిల్లాన్ ముంబై కచేరీలో తారా అతనితో స్టేజ్‌పై సరదాగా గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో వీర్ అసౌకర్యంగా ఫీల్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తారా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఇవన్నీ తప్పుడు కథనాలుని కొట్టిపారేసింది. వీర్ కూడా ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసిందని చెప్పాడు. తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీ షేర్ అసలైన వీడియో షేర్ చేశాడు. ఇందులో ఇద్దరూ ఉత్సాహంగా కనిపించాడు. ఆ వీడియోను వీర్ రీపోస్ట్ చేస్తూ “నిజం ఎప్పుడూ గెలుస్తుంది” అంటూ వ్యాఖ్యానించాడు.

READ MORE: Abhishek Sharma: టీ20 ప్రపంచకప్‌కు ముందు టెన్షన్‌ పెడుతున్న అభిషేక్ శర్మ!

మొదట.. దీపావళి సందర్భంగా తారా వీర్‌తో కలిసి ప్రేమతో కూడిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అతడిని అధికారికంగా పరిచయం చేసింది. గణేష్ చతుర్థి సందర్భంగా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. గత కొన్ని నెలలుగా ఫ్యాషన్ షోలలోనూ వీరిద్దరూ కలిసి షోస్టాపర్లుగా ర్యాంప్‌పై నడిచారు. ఈ ఏడాది ప్రారంభంలో డేటింగ్ మొదలుపెట్టిన తారా – వీర్ జూలై మధ్యలో తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. ఏపీ ధిల్లాన్ పాటకు సంబంధించిన ఫోటోపై వీర్ “My” అంటూ కామెంట్ చేయగా, తారా “Mine” అంటూ స్పందించడంతో వారి రిలేషన్ అధికారికంగా బయటపడింది. కొన్ని నెలల్లోనే ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు రావడం కలకలం రేపింది.

Exit mobile version