టీమిండియా మాజీ లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్.. మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా.. ఆయన స్థానంలో మిగతా టెస్టు మ్యాచ్‌ల కోసం యువ క్రికెటర్‌ను ఎంపిక చేశారు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందు బౌలింగ్ ఆల్ రౌండర్ తనుష్ కోటియన్ జట్టులో చేరనున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు ఈ యువ ఆటగాడిని జట్టు స్క్వాడ్ లోకి తీసుకున్నట్లు టీమిండియా ప్రకటించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. డిసెంబర్ 24 ( మంగళవారం) ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. అయితే.. ఈ ఆటగాడు మిగతా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడుతాడో లేదో కానీ.. స్క్వాడ్‌లో మాత్రం చేరుతాడు.
Read Also: Vinod Kambli: మళ్లీ క్షీణించిన మాజీ క్రికెటర్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ముగిసిన వెంటనే 38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఒక టెస్ట్ మాత్రమే ఆడాడు. అడిలైడ్ ఓవల్‌లో పింక్-బాల్ మ్యాచ్‌లో ఆడిన ఈ సీనియర్ ఆటగాడు.. 18 ఓవర్ల వేసి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. మరోవైపు.. 2018లో క్రికెట్ లోకి అడుగుపెట్టిన తనుష్ కోటియన్.. ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో ఆడాడు. ముంబైలో జన్మించిన ఈ క్రికెటర్ 25.70 సగటుతో 101 స్కాల్ప్‌లను కైవసం చేసుకున్నాడు. అలాగే.. రెండు సెంచరీలతో 41.21 సగటుతో 1525 పరుగులు చేశాడు.
Read Also: Bangladesh: భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ.. షేక్ హసీనాను తిరిగి పంపించాలని వినతి