Site icon NTV Telugu

Tandoori roti: తందూరీ రోటీ బ్యాన్‌.. రూల్స్ అతిక్రమిస్తే రూ.5లక్షల జరిమానా

Tandoori Roti

Tandoori Roti

Tandoori roti: తందూరీ రోటీని ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త. ఇకపై తందూరీ రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే తందూరీ రోటీని బ్యాన్ చేసింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న తందూరీ రోటీ ప్రియులకు ప్రభుత్వం ఈ చేదువార్త తెలిపింది. ఇకపై భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్‌లలో తందూరి రోటీ అందుబాటులో ఉండదు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తందూరీ రోటీని నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం.. రాష్ట్రంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ ఆహార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని హోటల్, దాబా నిర్వాహకులు తందూరీ రోటీ తయారీని నిలిపివేయాలని ఆహార శాఖ నోటీసులు జారీ చేసింది. తందూరీ రోటీని తయారు చేసేందుకు ప్రత్యేక పరికరాలను వినియోగిస్తారు. చెక్కతో తయారు చేసిన డ్రమ్‌లో బొగ్గుని మండిస్తూ వీటిని తయారు చేస్తారు. బొగ్గు అధికంగా వినియోగించడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్ముకుని వాతావరణం కాలుష్యమవుతోంది. అందుకే వీటిపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ ఓవెన్‌ లేదా ఎల్పీజీ గ్యాస్‌లను మాత్రమే వినియోగించాలని అధికారులు ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోని వారికి తందూరీ రోటీ చాలా ఇష్టమైన వంటకం. అక్కడి వారు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కారు తందూరీ రోటీని బ్యాన్‌ చేయడం వల్ల ఉసూరుమంటున్నారు.

Husband Lifts Wife Body: కన్నీళ్లు తెప్పించే హృదయ విదారక ఘటన.. భార్య శవాన్ని మోస్తూ..

హోటళ్లు, దాబాల నిర్వహణకు ఇప్పుడు కలప-బొగ్గును కాల్చి తందూరీ రోటీ తయారు చేయడం నిషేధమని ఆహార శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. బదులుగా ఎలక్ట్రిక్ ఓవెన్ లేదా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించాలని కూడా సూచించబడింది. రాష్ట్రంలోని ప్రజలు తందూరీ రోటీని చాలా ఇష్టపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఈ నోటిఫికేషన్ తర్వాత తందూరీ రోటీ ప్రియులు నిరాశకు గురయ్యారు. అలాగే, ఈ ఆర్డర్ దాబా-హోటల్ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యాపారం దెబ్బతింటుందని దాబా యజమానులు భయపడుతున్నారు.

Exit mobile version