Site icon NTV Telugu

Delhi: ఇకపై ఢిల్లీలో ‘తందూరీ రోటీ’ బంద్.. ఎందుకో తెలుసా!

Tandoori Roti

Tandoori Roti

Delhi: దేశ రాజధానిలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత దృష్ట్యా, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి రాజధానిలోని అన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, వీధుల్లోని ఆహార దుకాణాలలో బొగ్గు, కలపతో కాల్చిన తందూరీ రోటీలను పూర్తిగా నిషేధించింది. 1981 వాయు చట్టంలోని సెక్షన్ 31( A) కింద ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు డీపీసీసీ తెలిపింది. ఇకపై కచ్చితంగా అన్ని వాణిజ్య కిచెన్‌లను గ్యాస్, విద్యుత్ లేదా ఇతర ఇంధనాలకు మార్చాలని తెలియజేసింది.

READ ALSO: Bitcoin Price Drop: క్రిప్టో క్రాష్.. 24 గంటల్లో రూ.12 లక్షల కోట్లు ఆవిరి..

DPCC కథనం ప్రకారం .. బొగ్గు, కలపతో వంట చేయడం ద్వారా ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో మరింత కాలుష్యానికి కారణం అవుతుందని తెలిపింది. ఇది గాలి నాణ్యత సూచికలో నిరంతర క్షీణతకు దారితీస్తున్న కారణంగా ఈ ఉత్తర్వును కఠినంగా అమలు చేయాలని, నగరం అంతటా తనిఖీలు నిర్వహించాలని పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. ఈ ఉత్తర్వు వెంటనే అమలులోకి వస్తుందని, దీని అర్థం ఇకపై ఢిల్లీలో తందూరీ రోటీలు అందుబాటులో ఉండవని చెప్పింది.

వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, రాజధానిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ( GRAP) కఠినమైన స్టేజ్ 4 నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో అవసరమైన సేవలు మినహా ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే CNG, LNG, ఎలక్ట్రిక్, BS-6 డీజిల్ ట్రక్కులను అనుమతి ఇస్తున్నారు. అయితే BS-4, అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న డీజిల్ హెవీ గూడ్స్ వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో సోమవారం AQI 500కి చేరుకుంది. నిజానికి ఇది ప్రమాదకర స్థాయిలోకి వస్తుంది. అలాగే ఇంకా చాలా ప్రాంతాలలో AQI స్థిరంగా 400 పైన ఉందని అధికారులు వెల్లడించారు. కాలుష్యం కారణంగా ప్రజలు కంటి చికాకు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. GRAP-4 అమలు తర్వాత 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ మోడ్‌లో బోధనలు చేయాలని ఆదేశించారు. అలాగే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో బోధనలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొంది.

READ ALSO: ISIS Australia Link: నిఘా సంస్థలను మోసం చేసిన సిడ్నీ కసాయి..

Exit mobile version