Site icon NTV Telugu

Tammineni Sitaram: మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన తమ్మినేని సీతారాం..

Tammineni Sitaram

Tammineni Sitaram

ఆమదాలవలస వైసీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం నిర్వహించారు. మిథున్ రెడ్డి అరెస్టుపై ఆయన స్పందించారు. వంశీ, పూసాన కృష్టమురళి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా అనేక మంది నాయకులు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు, హత్యలు పెరుగుతున్నాయని.. ప్రభుత్వం ఉందా అనిపిస్తుందన్నారు. జగన్ రూ.3.30 లక్షలు కోట్లు అప్పు చేస్తే అందులో రూ. 2.50లక్షల కోట్లు ప్రజలకు సంక్షేమం అందించారని స్పష్టం చేశారు. జగన్ అన్ని వర్గాలకు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ. 1.8 లక్షల కోట్లు అప్పు చేసిందని.. అప్పుచేసిన డబ్బులు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

READ MORE: ISKCON: ఇస్కాన్ రెస్టారెంట్‌లో కావాలని చికెన్ తిన్న వ్యక్తి.. హిందువుల ఆగ్రహం..

కూటమిలో బాటిల్ పై 30 రూపాయలు వేసుకొని ఓపెన్ బెల్ట్ షాప్ లు నడుస్తున్నాయని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఇది నారా వారి సారా స్రవంతి పథకమని విమర్శించారు. ఇసుక ఏథేచ్ఛగా తవ్వుకుంటూ పోతున్నారని.. అధికారులు చూస్తూ ఊరుకున్నారన్నారు. పరిమితిని మించి ఇసుక తవ్వుతున్నా.. ఇసుక దోపిడీ జరుగున్నా అడిగే లేడన్నారు. రెడ్ బుక్ పాలన ద్వారా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

READ MORE: Monsoon session: పార్లమెంట్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’పై చర్చించేందుకు కేంద్రం సిద్ధం..

Exit mobile version