Tamim Iqbal Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి బంగాళాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పునరాగమనం చేయగలడని గత కొన్ని రోజుల ముందు ఊహాగానాలు ఉండేవి. అయితే, ఈ వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం లేదని ప్రకటించడం ద్వారా అన్ని చర్చలకు ముగింపు పలికాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో, అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ తమీమ్ ఇక్బాల్ 35 ఏళ్ల వయస్సులో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగిసిందని ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన తన సందేశంలో, తమీమ్ “నేను చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. ఈ గ్యాప్ ఇక పూర్తికావడం లేదు. నేను చాలా కాలంగా నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఈ రోజు నా అంతర్జాతీయ క్రికెట్ అధ్యాయం ముగిసింది” అని ఆయన రాసుకొచ్చారు. తమీమ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి తన సమయాన్ని వెచ్చించుకున్నానని, నా గురించిన చర్చతో జట్టు దృష్టి మరల్చకూడదని ఆయన వెల్లడించారు.
Also Read: Viral Video: మూడో తరగతి అమ్మాయికి గుండెపోటు.. పాఠశాల ప్రాంగణంలోనే.. (వీడియో)
తమీమ్, 2023 ప్రపంచ కప్‌కు ముందు జట్టు నుండి తప్పించబడినందుకు షాక్ అనిపించిందని వెల్లడించారు. ప్రతి చోటా అభిమానులు నన్ను జాతీయ జట్టులో తిరిగి చూడాలని కోరుకుంటున్నారని, వారి ప్రేమకు నేను చాలా కృతజ్ఞతలు అని అన్నారు. ఇకపోతే, బంగ్లాదేశ్ తరఫున 243 వన్డే మ్యాచ్‌లు ఆడిన తమీమ్ ఇక్బాల్ 240 ఇన్నింగ్స్‌లలో 8357 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, అతను 70 టెస్ట్ మ్యాచ్‌లలో 134 ఇన్నింగ్స్‌లలో 5134 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.అలాగే 78 టీ20ల్లో 1758 పరుగులు చేశాడు.